షాకింగ్ కామెంట్స్ చేసిన నిత్యామీనన్

Published on Nov 29,2019 12:12 PM

మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్ చేసి అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఇంతకీ ఈ భామ చేసిన కామెంట్స్ ఏంటో తెలుసా ....... ఇది నేను చేసుకున్న పెళ్లి కాదు పెద్దలు నిర్ణయించిన పెళ్లి అంటూ కామెంట్స్ చేయడమే! పెళ్లి ఏమిటి ? పెద్దలు నిర్ణయించడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? అసలు విషయం ఏంటంటే నిత్యామీనన్ కు సినిమాల్లో నటించడం ఇష్టం లేదట !

కానీ తన పేరెంట్స్ నిర్ణయం వల్ల సినిమాల్లో నటించాల్సి వస్తోందని కానీ నాకు వ్యక్తిగతంగా అయితే అడవుల్లో ఉన్న జంతువులను నా కెమెరాలో బంధించాలనే ఆశ ఉందని అంతేకాని నటించడం ఇష్టంగా లేదని బాంబ్ పేల్చింది. అలాగే నాకు నచ్చిన పాత్రలను చిత్రాలను మాత్రమే చేస్తాను అంతేకాని ఒత్తిడి చేయడం వల్ల నా నుండి నటనను రాబట్టుకోలేరు అంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇస్తోంది నిత్యామీనన్.