ఆసక్తి పెంచుతున్న నిశ్శబ్దం ట్రైలర్

Published on Mar 06,2020 06:03 PM

సాలిడ్ అందాల భామ అనుష్క కీలక పాత్రలో నటించిన చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్ర ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తమిళ నటుడు మాధవన్ , అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే , అంజలి తదితరులు నటించారు. ఆత్మ , దాని ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే తప్పకుండా ఈవేసవిలో సస్పెన్స్ థ్రిల్లర్ కోరుకునే ప్రేక్షకులకు మంచి సినిమా అనే అనిపిస్తోంది.

గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించగా కోన వెంకట్ అసోసియేట్ అయి ఉన్నాడు ఈ ప్రాజెక్ట్ కు. అనుష్క నటించిన చిత్రం రాక చాలా రోజులు అవుతుండటంతో తప్పకుండా ఈ సినిమాపై కాస్త అంచనాలు ఉండటం ఖాయం. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ కూడా ఉంది దాంతో కాస్త ఆలస్యమైనా మంచి హిట్ కొట్టడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం.