అంచనాలు పెంచుతున్న నిశ్శబ్దం టీజర్

Published on Oct 27,2019 03:40 PM

సాలిడ్ అందాల భామ అనుష్క తాజాగా నటిస్తున్న చిత్రం '' నిశ్శబ్దం ''. అనుష్క తో పాటుగా తమిళ నటుడు మాధవన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు . కాగా ఈరోజు దీపావళి కావడంతో నిశ్శబ్దం ప్రీ టీజర్ ని విడుదల చేసారు. ప్రీ టీజర్ తో ఒక్కసారిగా నిశ్శబ్దం చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విభిన్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ని నవంబర్ 7 న విడుదల చేయనున్నారు.

ఎందుకంటే ఆ రోజు అనుష్క పుట్టినరోజు మరి. బాహుబలి తర్వాత అనుష్క చాలా లావయ్యింది , ఆ సమయంలో భాగమతి చిత్రంలో నటించింది . ఆ సినిమా తర్వాత అనుష్క నటించిన సినిమా ఏది విడుదల కాలేదు దాంతో ఈ భామ నటించిన సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. టీజర్ బాగుంది మరి సినిమా ఎలా ఉంటుందో !