మళ్ళీ వాయిదాపడిన నిఖిల్ చిత్రం

Published on Mar 25,2019 12:34 PM

యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటించిన అర్జున్ సురవరం చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది . తమిళంలో విజయం సాధించిన కణితన్ చిత్రాన్ని తెలుగులో అర్జున్ సురవరం గా రీమేక్ చేస్తున్నారు . ఈ సినిమాని గత ఏడాది నవంబర్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు . అయితే కుదరలేదు దాంతో జనవరిలో అన్నారు ఫిబ్రవరిలో అన్నారు కట్ చేస్తే మార్చి అన్నారు ఇక ఇప్పుడేమో మే 1న అని తాజాగా డిసైడ్ చేసారు . 

నిఖిల్ జర్నలిస్ట్ గా నటిస్తున్న ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నిఖిల్ . ఎందుకంటే నిఖిల్ గత చిత్రాలు ఘోర పరాజయం పాలయ్యాయి . దాంతో అర్జున్ సురవరం తప్పకుండా హిట్ అవుతుందని నమ్ముతున్నాడు . అయితే ఆ సినిమానేమో వాయిదాల మీద వాయిదాలు పడుతోంది మరి .