కార్తీకి లిప్ లాక్ ఇవ్వడానికి భయపడిందట

Published on Dec 14,2019 01:01 PM

తమిళ స్టార్ హీరో కార్తీ కి లిప్ లాక్ ఇవ్వడానికి భయపడ్డానని అంటోంది మలయాళ భామ '' నిఖిలా విమల్ ''. కార్తీ హీరోగా నటించిన తమిళ చిత్రం ''  తంబి ''. జ్యోతిక - కార్తీ అక్కా తమ్ముడిగా నటించిన ఈ చిత్రానికి జీతు జోసఫ్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రంలో కార్తీ సరసన మలయాళ కుట్టి నిఖిలా విమల్ నటించింది. అయితే షూటింగ్ ప్రారంభమైనప్పుడు మొదటి రోజునే కార్తీ తో సన్నిహిత సన్నివేశాలను చిత్రీకరించారట దర్శకులు. సన్నిహిత సన్నివేశాల్లో భాగంగా లిప్ లాక్ సీన్ కూడా చేశారట దాంతో మొదటి రోజునే ఇలాంటి సన్నివేశం ఏంట్రా బాబూ ! అనుకుంటూ చాలా భయపడిపోయిందట నిఖిలా విమల్.

ఈ మలయాళ భామ భయాన్ని అర్ధం చేసుకున్న హీరో కార్తీ ఈ భామ దగ్గరకు వచ్చి భయపడాల్సిందేమీ లేదు కంగారు ని పక్కన పెట్టి నటించు. నీ బాయ్ ఫ్రెండ్ తో ఎలా మసులుకుంటావో అలా చెయ్ అని సలహా ఇచ్చాడట. దాంతో భయాన్ని పక్కన పెట్టి లిప్ లాక్ ఇచ్చిందట నిఖిలా విమల్. ఇక ఈ తంబి సినిమా ఈనెల 20 న విడుదల అవుతోంది. తమిళ తంబి చిత్రాన్ని తెలుగులో దొంగ గా డబ్ చేస్తున్నారు. తమిళంతో పాటుగా తెలుగులో కూడా అదే రోజున విడుదల అవుతోంది.