హ్యాపీ డేస్ సీక్వెల్ చేయాలంటున్న నిఖిల్

Published on Mar 11,2019 10:41 AM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2007 లో వచ్చిన చిత్రం హ్యాపీ డేస్ . నిఖిల్ , వరుణ్ సందేశ్ , తమన్నా , రాహుల్ , వంశీ , సోనియా తదితరులు నటించిన హ్యాపీ డేస్ సంచలన విజయం సాధించింది . నిఖిల్ హ్యాపీ డేస్ చిత్రంతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే . అయితే ఆ సినిమాలో నటించిన మిగతా నటీనటుల్లో తమన్నా స్టార్ హీరోయిన్ అయిపొయింది అలాగే నిఖిల్ కూడా ఇక మిగతా హీరోలు అంతగా రాణించలేక పోయారు . 

వరుణ్ సందేశ్ కు మంచి ఇమేజ్ వచ్చింది కానీ అది త్వరగానే పోయింది , వాళ్ళ విషయాలను పక్కన పెడితే నిఖిల్ మాత్రం తాజాగా హ్యాపీ డేస్ లోని ఓ సీన్ ని ట్వీట్ చేసి మళ్ళీ హ్యాపీ డేస్ చిత్రానికి సీక్వెల్ చేస్తే బాగుండు అని తన అభిప్రాయాన్ని తెలిపాడు అంతేకాదు ఈ విషయం శేఖర్ కమ్ముల వరకు చేరాలని అలా రీ ట్వీట్ లు చేయండని తన అభిమానులను కోరుతున్నాడు నిఖిల్ . ఈ హీరో ఆలోచన బాగానే ఉంది కానీ శేఖర్ కమ్ముల దీని గురించి ఆలోచిస్తాడో ? లేదో ?