పాపం ! నిఖిల్ కష్టాలు ఇన్నిన్ని కాదయా !

Published on Nov 20,2019 04:06 PM

యంగ్ హీరో నిఖిల్ కష్టాలు ఎన్నని చెప్పాలి పాపం ! ఈ హీరో నటించిన '' అర్జున్ సురవరం '' చిత్రం విడుదల కావడానికి ఎన్నో కష్టాలు పడుతోంది. గత ఏడాది కాలంగా ఈ సినిమా పలురకాలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. అయితే తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎలాగైనా సరే విడుదల చేయాలనీ పాపం చాలా కష్టాలు పడ్డాడు హీరో నిఖిల్. అయితే ఇతడి కష్టాలు ఫలించి ఎట్టకేలకు ఈనెల 29 న అర్జున్ సురవరం విడుదల అవుతోంది.

లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంపై నిఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అర్జున్ సురవరం చిత్రం ఒక దశలో విడుదల అవుతుందా ? అనే అనుమానం ఉండేది కానీ అన్ని ఇబ్బందులను అధిగమించి నవంబర్ 29 న విడుదలకు సిద్ధమైంది.భారీ కుంభకోణం ని వెలుగులోకి తెచ్చే జర్నలిస్ట్ పాత్రలో నటించాడు నిఖిల్. మరి ఈ సినిమా విజయం సాధిస్తుందా ? లేదా ? అన్నది ఈనెల 29 న తేలనుంది.