ఏడాది తర్వాత విడుదల అవుతున్న నిఖిల్ సినిమా

Published on Oct 27,2019 12:00 PM

హీరో నిఖిల్ నటించిన అర్జున్ సురవరం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. తమిళంలో విజయం సాధించిన కనితన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసారు. ఈ చిత్రానికి అర్జున్ సురవరం అనే టైటిల్ పెట్టారు. ఇక ఈ చిత్రాన్ని గత ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ లో విడుదల చేయాలనీ అనుకున్నారు ఇక అప్పటి నుండి అర్జున్ సురవరం విడుదల వాయిదా పడుతూనే ఉంది.
               మెల్లిగా జనవరి వెళ్ళింది ఆ తర్వాత మార్చి అన్నారు కట్ చేస్తే మే అన్నారు ఆ తర్వాత సాహో విడుదల అయ్యాక అన్నారు అలా ...... అలా వాయిదా పడుతూ ఇప్పుడేమో నవంబర్ 29 న విడుదల అంటూ డేట్ ప్రకటించారు. అంటే సంవత్సరం తర్వాత నిఖిల్ చిత్రానికి మోక్షం లభించనుంది అన్నమాట.