వచ్చే ఏడాది పెళ్లి చేసుకోనున్న నిఖిల్

Published on Dec 14,2019 05:46 PM

యంగ్ హీరో నిఖిల్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. నిఖిల్ డాక్టర్ తేజస్విని ని ప్రేమించాడు. ఓ వేడుకలో పాల్గొన్న సమయంలో నిఖిల్ - తేజస్విని ల పరిచయం జరిగిందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఎంగేజ్ మెంట్ అయ్యింది. ఇక పెళ్లి మాత్రం వచ్చే ఏడాది 2020 లో జరుగనుందని తెలుస్తోంది. 2020 ప్రథమార్థంలోనే ఈ పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తోంది. నిఖిల్ సిద్దార్థ్ కు 34 ఏళ్ల వయసు దాంతో పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట నిఖిల్ తల్లిదండ్రులు. ఇక మరోవైపు డాక్టర్ తేజస్విని పేరెంట్స్ కూడా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారట.

నిఖిల్ గతంలో హీరోయిన్ కలర్స్ స్వాతి ని ప్రేమించినట్లుగా వార్తలు వచ్చాయి అయితే మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంతకుమించి మామధ్య ఏమి లేదు అంటూ ఆ పుకార్లను ఖండించారు. కట్ చేస్తే స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. విదేశాలకు వెళ్లిపోయింది. ఇక ఇప్పుడేమో నిఖిల్ వంతు వచ్చింది. నిఖిల్ కూడా డాక్టర్ తేజస్విని ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. ఇటీవలే విడుదలైన నిఖిల్ నటించిన చిత్రం అర్జున్ సురవరం మంచి వసూళ్ల ని సాధించింది. దాంతో మంచి హిట్ తో 2019 కు గుడ్ బై చెబుతున్నాడు అలాగే 2020 కి తన పెళ్లితో స్వాగతం పలుకుతున్నాడు.