పైరసీ పై ఆవేధన వ్యక్తం చేసిన నిఖిల్

Published on Dec 09,2019 07:41 PM

అర్జున్ సురవరం విడుదలై వారం రోజులు కాకుండానే పైరసీ సీడీ లు మార్కెట్ లో బహిరంగంగా అమ్ముతుండటంతో తీవ్ర ఆవేధన వ్యక్తం చేస్తున్నాడు హీరో నిఖిల్. నవంబర్ 29 న అర్జున్ సురవరం విడుదల కాగా ఆ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది అయితే ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు దాంతో విజయయాత్ర అంటూ ప్రేక్షకులను కలుస్తున్నాడు హీరో నిఖిల్. తాజాగా ఈ సినిమా కోసం గుంటూరు వెళ్ళాడు అయితే అక్కడ బహిరంగంగా అర్జున్ సురవరంతో పాటుగా ఇతర సినిమాల పైరసీ సిడిలను అమ్ముతున్నారు.

దాంతో ఇలా అమ్మడం తప్పు కదా ! అని ప్రశ్నించగా సదరు మహిళ కష్టాలు నిఖిల్ కు చెప్పడంతో చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు . ఈ తతంగమంతా నిఖిల్ షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అసలే హిట్ లేక ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో ఏడాది తర్వాత విడుదలైన అర్జున్ సురవరం కు మంచి టాక్ అయితే వచ్చింది కానీ వసూళ్ల కోసం ప్రయాసపడుతున్న సమయంలో పైరసీ మరింత కిల్ చేస్తోంది సినిమాని. దాంతో తీవ్ర ఆవేధనతో ఉన్నాడు నిఖిల్.