వచ్చే ఏడాదిలో నిహారిక పెళ్లి

Published on Nov 18,2019 04:30 PM

మెగా డాటర్ నిహారిక పెళ్లి వచ్చే ఏడాది జరగడం ఖాయమని తెలుస్తోంది. వచ్చే ఏడాది అంటే ఎప్పుడో కాదు సుమా ! 2020 లోనే . హీరోలు మాత్రమే సినిమారంగంలోకి వస్తున్న ఈరోజుల్లో మెగా కుటుంబం నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నిహారిక. అయితే ఈ భామ నటించిన సినిమాలు ఏవి కూడా అంతగా ఆడలేదు దాంతో వెబ్ సిరీస్ లు చేసుకుంటూ పోతోంది. సినిమాల సంగతి ఎలా ఉన్నప్పటికీ వెబ్ సిరీస్ లలో మాత్రం రాణిస్తోంది నిహారిక.

ఇక సినిమాల్లోకి వచ్చే ముందే నాగబాబు ఖచ్చితంగా మూడు నాలుగేళ్ళ లో పెళ్లి చేస్తానని చెప్పాడట ! అప్పుడన్న మాట ప్రకారం ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. కొని సంబంధాలను ఎంపిక చేశారట. వాటిలో ఒక సంబంధాన్ని ఫైనల్ చేసే పనిలో పడ్డారట మెగా కుటుంబం. అన్నయ్య చిరంజీవి ఫైనల్ చేసే సంబంధానికి కట్టుబడిఉండాలని నిర్ణయించుకున్నాడట నాగబాబు. అంటే త్వరలోనే నిహారిక పెళ్లి జరుగనుంది అన్నమాట.