సైరా లో గిరిజన యువతిగా నిహారిక

Published on Feb 26,2019 05:31 PM

మెగా డాటర్ నిహారిక కొణిదెల సైరా నరసింహారెడ్డి చిత్రంలో గిరిజన యువతిగా నటిస్తోంది . కేవలం రెండు మూడు సన్నివేశంలో మాత్రమే కనిపించనుందట నిహారిక . పెద్దనాన్న చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కాబటి అందులో నేను తప్పకుండా నటించాలి అని గట్టిగా పట్టుబట్టిందట నిహారిక . దాంతో ఏమిచేయాలో తెలీక ఉన్న ఈ చిన్ని వేషాన్ని నిహారిక కు ఇచ్చారట . 

ఉయ్యాలవాడ  నరసింహారెడ్డి కి ఆశ్రయం ఇచ్చే గిరిజన యువతిగా కనిపించనుంది . ఆమేరకు చిరంజీవి - నిహారిక లపై ఆ సన్నివేశాలను ఇటీవలే చిత్రీకరించారు దర్శకులు సురేందర్ రెడ్డి . అత్యంత భారీ బడ్జెట్ తో చరణ్ నిర్మిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెలుగులోనే కాకుండా ఇతర బాషలలో కూడా రిలీజ్ చేయనున్నారు .