గ్లామర్ రోల్స్ చేస్తానంటున్న నిహారిక

Published on Apr 22,2020 04:48 PM
మెగా డాటర్ నిహారిక గ్లామర్ రోల్స్ చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన నిహారిక ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ వెండితెర మీదకొచ్చింది అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో నిహారిక ఆశలు అడియాసలే అయ్యాయి. ఆ తర్వాత కూడా చేసిన సినిమాలు కూడా అట్టర్ ప్లాప్ అయ్యాయి దాంతో తన పంథా మార్చుకోవాలని భావించిందేమో అందుకే గ్లామర్ రోల్స్ కి సిద్ధం అంటోంది.

అందుకే కాబోలు ఆమధ్య రకరకాల భంగిమల్లో గ్లామరస్ గా ఫోటోషూట్ చేసింది నిహారిక. ఇక తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో కొంతమందికి సమాధానాలు ఇచ్చింది. అందులో భాగంగానే ఓ తమిళ చిత్రంలో గ్లామరస్ గా నా పాత్ర ఉంటుందని సమాధానం ఇచ్చింది. పైగా త్వరలోనే ఆ తమిళ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుందని కూడా అంటోంది నిహారిక. మొత్తానికి అందాల ఆరబోతకు సిద్ధమయ్యిందన్న మాట నిహారిక.