జడ్జిగా వచ్చిన నిహారిక

Published on Dec 21,2019 09:18 AM

అదిరింది అనే కార్యక్రమానికి నాగబాబు తో పాటుగా నిహారిక జడ్జిగా వ్యవహరిస్తోంది. జబర్దస్త్ కు పోటీగా ప్రారంభమైన షో అదిరింది. ఈ షో గత ఆదివారం రోజున ప్రారంభమైంది కానీ ఆరోజున కేవలం అదిరింది షో ఎలా ఉండబోతోంది అన్నది మాత్రమే వివరించారు. ఇక అసలైన షో ఈ ఆదివారం రోజున అంటే డిసెంబర్ 22 న ప్రారంభం కానుంది. చంద్ర , ఆర్పీ , వేణు , ధన్ రాజ్ లు టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తున్న ఈ షోకు జడ్జి గా తండ్రి నాగబాబు తో పాటుగా కూతురు నిహారిక కూడా వ్యవహరించనుంది. ఆమేరకు ప్రోమో విడుదల చేసారు నిర్వాహకులు.

ఇక ఈ షోలో కూడా గ్లామర్ కు కొదవ లేకుండాపోయింది. జబర్దస్త్ కు అనసూయ , రష్మీ సరికొత్త అందాలను తేగా ఈ అదిరింది షోకు మాత్రం టివి నటి , యాంకర్ అయిన సమీరా గ్లామర్ ప్లస్ కానుంది. సమీరా తెలుగులో పలు సీరియల్ లలో నటించింది. ఈటీవి ప్రభాకర్ కు జోడిగా పలు సీరియల్ లలో నటించిన ఈ భామ ఇటీవలే సన కొడుకుని పెళ్లి చేసుకుంది. నటనకు కొంతకాలంగా దూరంగా ఉన్న సమీరా అదిరింది షోతో మళ్ళీ బుల్లితెర కు వస్తోంది. ఇక ఈ అదిరింది ఈ నెల 22 న స్టార్ట్ అవుతోంది కాబట్టి మొత్తం ఎపిసోడ్ అయ్యాక కానీ తెలీదు హిట్ అవుతుందా ? లేదా ? అన్నది.