బెల్లంకొండకు షాక్ ఇచ్చిన నిధి అగర్వాల్

Published on Apr 01,2020 02:16 PM
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు గట్టి షాక్ ఇచ్చింది హాట్ భామ నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో గ్లామరస్ డాల్ గా కనిపించి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన భామ నిధి అగర్వాల్ దాంతో ఇలాంటి హాట్ భామ చేత ఐటెం సాంగ్ చేయిస్తే సినిమాకు మరింత హైలెట్ అవుతుందని భావించారట హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అలాగే దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. తాజాగా ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా అల్లుడు అదుర్స్.

హీరోయిన్ గా మరో ఇస్మార్ట్ శంకర్ భామ నభా నటేష్ నటిస్తోంది దాంతో ఆ కత్తికి తోడు ఈ చురకత్తి కూడా తోడైతే బాగుంటుందని భావించి నిధి అగర్వాల్ ని ఐటెం సాంగ్ కోసం సంప్రదించారట. ఈ భామ కూడా సంతోషంగా ఒప్పుకుంది కానీ 60 లక్షలు డిమాండ్ చేసిందట ఒక్క ఐటెం సాంగ్ కు దాంతో షాక్ అవ్వడం హీరో వంతు అయ్యింది. 60 లక్షలిస్తే ఐటెం సాంగ్ చేయడానికి అభ్యంతరం లేదని చెప్పిందట కానీ ఒక్క పాటకు అంతనా ? అని డైలమాలో పడ్డారట.