రేప్ జరగడానికి నిధి అగర్వాల్ కారణమట !

Published on Dec 02,2019 01:22 PM

సమాజంలో ఎక్కువగా అత్యాచారాలు జరగడానికి నువ్ ఇలా అందాలను ప్రదర్శించడమే కారణం అంటూ ఓ నెటిజన్ హీరోయిన్ నిధి అగర్వాల్ ని బాధ్యుడ్ని చేసాడు దాంతో షాక్ అవ్వడం నిధి అగర్వాల్ వంతయ్యింది. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తరచుగా తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో అందాల ఆరబోతకు సంబందించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది దాంతో ఆ ఫోటోలను చూసిన ఓ నెటిజన్ నిధి అగర్వాల్ పై పెద్ద అబాండం వేసాడు. నీలాంటి వాళ్ళ వల్లే రేప్ లు జరుగుతున్నాయని.

ఈ కామెంట్ తో కోపం వచ్చిన నిధి గట్టిగానే సమాధానం ఇచ్చింది ఆ నెటిజన్ కు. నీకు వెంటనే పింక్ సినిమా చూపించాలి ..... నీ అడ్రస్ చెప్పు పింక్ కాపీ పంపిస్తాను అంటూ రిప్లయ్ ఇచ్చింది నిధి అగర్వాల్. దాంతో నిధి అగర్వాల్ ని సమర్ధించే వాళ్ళు కొంతమంది అయితే మరికొంతమంది నిధి అగర్వాల్ ని విమర్శించే వాళ్ళు తయారయ్యారు సోషల్ మీడియాలో.