బోల్డ్ గా నటిస్తానంటున్న నిధి అగర్వాల్

Published on Jan 30,2019 11:59 AM

అర్జున్ రెడ్డి లాంటి చిత్రం కోసం ఎదురు చూస్తున్నానని , బోల్డ్ గా నటించడానికి సిద్ధమని ప్రకటించి సంచలనం సృష్టించింది నిధి అగర్వాల్ . హైదరాబాద్ లో పుట్టిన ఈ భామ బెంగుళూర్ లో పెరిగింది . సవ్యసాచి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ తాజాగా అఖిల్ సరసన మిస్టర్ మజ్ను అనే చిత్రంలో నటించింది . ఈనెల 25 న రిలీజ్ అయిన మిస్టర్ మజ్ను ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు కానీ రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ అనే చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది . 

అర్జున్ రెడ్డి చిత్రాన్ని చాలాసార్లు చూశానని , నాకు బాగా నచ్చిందని , అలాంటి బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి నేను సిద్ధం అంటూ తన సమ్మతిని తెలియజేసింది నిధి అగర్వాల్ . ఈ భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి అలాంటి క్యారెక్టర్ లు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు సిద్ధం అవుతారేమో చూడాలి . అయితే తెలుగులో ఈ భామ నటించిన సవ్యసాచి , మిస్టర్ మజ్ను రెండు చిత్రాలు కూడా ప్లాప్ అయ్యాయి .