అందాలతో పిచ్చెక్కించిన నిధి అగర్వాల్

Published on Apr 09,2019 10:29 AM

అందాల భామ నిధి అగర్వాల్ తన అందాలతో కుర్రాళ్ళని పిచ్చెక్కిస్తోంది . తాజాగా ఈ భామ ఇస్మార్ట్ శంకర్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు . ప్రస్తుతం రామ్ - నిధి అగర్వాల్ లపై ఐటెం సాంగ్ చిత్రీకరిస్తున్నారు పూరి జగన్నాధ్ . పూరి సినిమా అంటేనే ఓ మాస్ మసాలా పాట ఉండాల్సిందే . 

కుర్రకారుని ఓ ఊపేసే పాట లో నిధి అగర్వాల్ అందాల ఆరబోతతో కైపెక్కించడం ఖాయమని అంటున్నారు . అందుకు ఉదాహరణగా నిధి అగర్వాల్ కు సంబందించిన కొన్ని స్టిల్స్ రిలీజ్ చేసారు . ఎద అందాలతో కవ్విస్తూనే పిక్కల బలం చూపిస్తూ యువతకు గాలం వేస్తోంది నిధి . ఈ భామ అందాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . నిధి అందాల కోసం కుర్రాళ్ళు ఎగబడుతున్నారు . 

సవ్యసాచి చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ కు ఆ సినిమా చేదు ఫలితాన్ని ఇచ్చింది అయినప్పటికీ వెరవకుండా ఇస్మార్ట్ శంకర్ కోసం అందాలను ఉదారంగా ఆరబోస్తోంది .