విజయ్ దేవరకొండ వర్సెస్ సూర్య

Published on Mar 27,2019 11:27 AM

తమిళ స్టార్ హీరో సూర్య తో తలపడటానికి సిద్ధం అవుతున్నాడు తెలుగు హీరో విజయ్ దేవరకొండ . సూర్య నటించిన ''ఎన్ జి కే ''మే 31 న దక్షిణాదిన అన్ని బాషలలో రిలీజ్ అవుతుండగా అదే రోజున విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ రిలీజ్ అవుతోంది . డియర్ కామ్రేడ్ కూడా నాలుగు బాషలలో రిలీజ్ అవుతుండటం విశేషం దాంతో ఇద్దరు హీరోల మధ్య తీవ్ర పోటీ నెలకొంది . 

సూర్య కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అలాగే మంచి బిజినెస్ కూడా ఉంది . అయితే విజయ్ దేవరకొండ కు ఒక్క తెలుగులోనే క్రేజ్ ఉంది దాంతో సూర్య తో పోటీ తట్టుకోవడం విజయ్ దేవరకొండ వల్ల అవుతుందా ? అన్నది పెద్ద ప్రశ్నే ! అయితే సినిమా బాగుంటే తప్పకుండా పోటీ ఇస్తాడు లేదంటే షరా మాములే !