నిర్మాత కన్నుమూత

Published on Dec 01,2019 06:21 PM

తెలుగు నిర్మాత తోట రామయ్య రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తెలుగులో వచ్చిన '' రౌడీ '' , '' మళ్ళీ ఇంకోసారి '', '' రణధీరుడు '' లాంటి చిత్రాలను నిర్మించాడు తోట రామయ్య. తెలుగు చలన చిత్ర రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న తోట రామయ్య నిర్మాతగానే కాకుండా విభిన్న రంగాల్లో పనిచేసాడు. నవంబర్ 29 శుక్రవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో సికింద్రాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు తోట రామయ్య.

రేపు అనగా సోమవారం రోజున బన్సీలాల్ పేటలోని స్మశాన వాటికలో తోట రామయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. తోట రామయ్య కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సికింద్రాబాద్ లో నివసించే తోట రామయ్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసారు.