రాజ్ తరుణ్ కేసులో ఎన్ని ట్విస్ట్ లో

Published on Aug 24,2019 10:52 AM

యంగ్ హీరో రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ లో బోలెడు ట్విస్ట్ లు వెలుగులోకి వస్తున్నాయి . రాజ్ తరుణ్ నార్సింగ్ సర్కిల్ దగ్గర చేసిన కారు యాక్సిడెంట్ అనేక మలుపులు తిరుగుతోంది . కారు యాక్సిడెంట్ చేయలేదని చెప్పుకొచ్చిన రాజ్ తరుణ్ ఆ తర్వాత మాట మార్చి భయపడి పారిపోయానని ,నాకు ఎలాంటి గాయాలు కాలేదని ట్వీట్ చేసాడు . 

కట్ చేస్తే కార్తీక్ అనే యువకుడు ముందుకు వచ్చి రాజ్ తరుణ్ 5 లక్షలు ఇస్తానని మభ్య పెట్టాడని , నా దగ్గర ఉన్న విజువల్స్ అన్ని ఇవ్వాలని అడిగాడని , కానీ ఆ తర్వాత నన్ను బెదిరించారని ఆరోపణలు చేసాడు . దానికి కౌంటర్ గా రాజా రవీంద్ర వెలుగులోకి వచ్చి కార్తీక్ అనేవాడు మమ్మల్ని డబ్బు లకోసం డిమాండ్ చేసాడని ,మేము లొంగకపోవడంతో ఇలా ప్లేట్ ఫిరాయించాడని అంటున్నాడు . మొత్తానికి కారు యాక్సిడెంట్ రకరకాల మలుపులు తిరుగుతోంది .