అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్

Published on Nov 24,2019 02:44 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సామజవరగమనా అనే పాటతో సరికొత్త సంచలనం సృష్టించాడు. యూట్యూబ్ లో ఇప్పటికే ఈ పాట వ్యూస్ పరంగా సంచలనం సృష్టించగా అదే పాట లో లైక్స్  కూడా సరికొత్త చరిత్ర సృష్టించింది. సామజవరగమనా పాటకు ఎన్ని లైక్స్ వచ్చాయో తెలుసా ...... 1 మిలియన్ లైక్స్ దాటిపోయాయి. ఇది కూడా పెద్ద రికార్డ్ అనే చెప్పాలి. ఇప్పటివరకు తెలుగు చిత్రాలలోని పాటకు 1 మిలియన్ లైక్స్ వచ్చిన దాఖలాలు లేవు ఆ రికార్డ్ ని అల్లు అర్జున్ సామజవరగమనా తో అందుకున్నాడు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 12 న విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించిన ఈ చిత్రంలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తోంది. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఇప్పటివరకు 2 చిత్రాలు '' జులాయి '' , '' సన్నాఫ్ సత్యమూర్తి '' రాగా రెండు కూడా హిట్ అయ్యాయి దాంతో అల వైకుంఠపురములో చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.