బాలయ్య ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Published on Oct 27,2019 03:29 PM

నందమూరి బాలకృష్ణ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో బాలయ్యని ఇంతగా ట్రోల్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ....... రూలర్ చిత్రంలోని పోలీస్ గెటప్ లో ఉన్న బాలయ్య లుక్స్ కారణం. దీపావళి పండగ సందర్బంగా బాలకృష్ణ తాజాగా కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న రూలర్ చిత్రంలోని బాలయ్య పోలీస్  గెటప్ లుక్స్ ని విడుదల చేసారు.

అయితే ఈ లుక్స్ పరంగా బాలయ్యని ట్రోల్ చేస్తున్నారు బాలయ్య అంటే గిట్టని వాళ్ళు. విచిత్రం ఏంటంటే ఈ పోస్టర్ లు బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా నచ్చడం లేదు అంటే అర్ధం చేసుకోవచ్చు పోస్టర్ లు ఎలా ఉన్నాయో. పోలీస్ గెటప్ లో ఉన్న బాలయ్య లో అప్పటి దరహాసం లేదు , రౌద్రం లేదు మరి అందుకే ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ రూలర్ చిత్రాన్ని డిసెంబర్ 20 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.