సమంత పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

Published on Mar 12,2019 04:30 PM

సమంత పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . సమంత పై ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ....... కుర్ కురే  అనే బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించడమే ! కుర్ కురే ఆరోగ్యానికి హానికరం అని సామజిక ఉద్యమకారులు మాత్రమే కాదు కోర్టులు కూడా మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే . అందుకే అప్పటి నుండి సినీ ప్రముఖులు కుర్ కురే వ్యాపార ప్రకటనలలో పాల్గొనడం లేదు . 

కట్ చేస్తే ఇప్పుడు తాజాగా సమంత కుర్ కురే కు బ్రాండ్ అంబాసిడర్ ని అంటూ ట్వీట్ చేసింది . సమంత ట్వీట్ చేయడమే ఆలస్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమంత పై . డబ్బులు ఇస్తే ఇలాంటి ప్రకటనలు చేస్తావా ? అంటూ తిడుతున్నారు కానీ సమంత వీటిని పట్టించుకునేలా కనిపించడం లేదు.