సమంత పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

Published on Nov 27,2019 12:07 PM

హీరోయిన్ సమంత పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. సమంత పై నెటిజన్ల కు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో ? తెలుసా ........ ఓ వీరాభిమాని చేసిన పనికి ఉప్పొంగిపోవడమే ! ఇటీవల నాగచైతన్య పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని చైతూ వీరాభిమాని ఒకరు గుడి మెట్లని మోకాళ్ళ పై ఎక్కాడు. అంతేకాదు ఆ తతంగమంతా వీడియో తీసి సమంత కు ట్యాగ్ చేసాడు. దాంతో ఉబ్బి తబ్బిబ్బైన సమంత అతడ్ని పొగడుతూ కలుద్దామని ట్వీట్ చేసింది. ఇదే కొంతమంది నెటిజన్ల కు నచ్చలేదు.

అందుకే సమంత పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మోకాళ్ళ పై గుడి మెట్లు ఎక్కడం వల్ల ప్రాణానికే ప్రమాదం పైగా అంగవైకల్యాణికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది అలాంటప్పుడు అతడ్ని మందలించాల్సింది పోయి ఎంకరేజ్ చేయడం ఏంటి ? అనేది వీళ్ళ కోపం కు కారణమయ్యింది. అయినా సెలబ్రిటీలు చెప్పినా కొంతమంది వీరాభిమానులు వింటారా ? వినరు కదా ! సమంత చేతిలో ఏముంది ?