విజయ్ దేవరకొండ పరువు తీసిన నెటిజన్లు

Published on Apr 15,2020 04:50 PM
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ పరువు తీసిపడేసారు నెటిజన్లు. ఈరోజు విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి పెట్టినట్లు ప్రకటించారు నెట్ ఫ్లిక్స్ బృందం. అయితే వాళ్ళు అలా ట్వీట్ చేసారో లేదో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని చూసిన వాళ్ళు ఇదో చెత్త సినిమా అంటూ కామెంట్ చేయడమే కాకుండా ఏకంగా నెట్ ఫ్లిక్స్ వాళ్లకు ఉచిత సలహా కూడా ఇస్తున్నారు. ఇంతకీ వాళ్ళు ఇస్తున్న సలహా ఏంటో తెలుసా ...... వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ నుండి తీసి మరో సినిమాని పెట్టుకోండి అని.

క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని అగ్ర నిర్మాత కె ఎస్ రామారావు నిర్మించారు. అయితే ఈ సినిమాపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకోగా అతడి ఆశలన్నీ అడియాసలే అయ్యాయి దారుణ పరాజయంతో. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. ఈ చిత్రంలో రాశి ఖన్నా , కేథరిన్ ట్రెసా , ఐశ్వర్య రాజేష్ , ఇసా బెల్లె హీరోయిన్ లుగా నటించారు.