నేహా శర్మ కేక పెట్టిస్తోంది

Published on Nov 25,2019 03:52 PM

చిరుత చిత్రంలో రాంచరణ్ సరసన నటించిన భామ నేహా శర్మ తాజాగా ఈ భామ కేక పెట్టిస్తోంది తన అందాల విందుతో. సందు దొరికితే చాలు అందాల ప్రదర్శన చేస్తూ సోషల్ మీడియాలో బాగానే పాపులర్ అవుతోంది. బాలీవుడ్ భామ అయిన నేహా శర్మ కు తెలుగులో మొదటి చిత్రమే చరణ్ సరసన నటించే ఛాన్స్ లభించింది. చిరుత కూడా మంచి విజయం సాధించింది కూడా. అయితే చరణ్ స్టార్ హీరో అయ్యాడు కానీ నేహా కు మాత్రం అంతగా కలిసి రాలేదు పాపం.

ఆ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ తో ఒక సినిమాలో నటించింది కానీ అది ప్లాప్ కావడంతో మళ్ళీ ఈ భామని తెలుగులో ఎవరూ పెట్టుకోలేదు. ఇక హిందీలో కూడా పెద్దగా ఛాన్స్ లు రావడం లేదు కానీ ఏవో కొన్ని సినిమాలు చేస్తూనే ఉంది. తాజాగా డీప్ గా అందాలను పందెంగా వేసి మరీ కుర్రాళ్ళని రెచ్చగొడుతోంది. సోషల్ మీడియాలో తన పోస్ట్ లను పెడుతూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది నేహా శర్మ.