ఘోరంగా అవమానిస్తున్న నేహా దుపియా

Published on Nov 21,2019 12:57 PM

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని ఘోరంగా అవమానిస్తోంది బాలీవుడ్ హీరోయిన్ నేహా ధూపియా. విక్కీ కౌశల్ సరసన నటించడం అంటే నాకు చిరాకు ఎందుకంటే అతడితో నటించడం చాలా చాలా కష్టం అందుకే విక్కీ నా వరెస్ట్ కో స్టార్ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసింది నేహా. తెలుగులో డాక్టర్ రాజశేఖర్ నటించిన విలన్ చిత్రంలో నటించింది నేహా ధూపియా అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు దాంతో తెలుగులో ఛాన్స్ లు లేకుండాపోయాయి ఈ భామకు.

అయితే తెలుగులో అంతగా ఛాన్స్ లు రాకున్నా హిందీలో మాత్రం బాగానే వస్తున్నాయి ఈ భామకు. ఇక పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన నేహా ధూపియా తన తప్పు తెలుసుకొని వెంటనే పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం పండంటి బిడ్డ తో భర్తతో సంతోషంగా జీవితాన్ని వెళ్లదీస్తోంది. అయితే ఇలా హీరో విక్కీ కౌశల్ ని అవమానించడమే సంచలనం అవుతోంది.