ఉత్తమ కామాంధుడి అవార్డు ఇవ్వాలట అతడికి

Published on Dec 28,2019 12:15 PM

ప్రముఖ తమిళ సినీ రచయిత వైరముత్తు కు ఉత్తమ కామాంధుడి అవార్డు ఇస్తే సముచితంగా ఉంటుందంటూ సంచలన ట్వీట్ చేసింది సింగర్ చిన్మయి శ్రీపాద. సింగర్ గా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలకు పనిచేసిన చిన్మయి ప్రముఖ రచయిత వైరముత్తుతో వైరం పెట్టుకుంది. అతడు నా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఎలుగెత్తి చాటింది అయితే పాపం చిన్మయి ఆవేదన అరణ్య రోధనే అయ్యింది. చిన్మయి చేసిన ఆరోపణలను పట్టించుకోకపోగా వైరముత్తుని అభిమానించే వాళ్ళు చిన్మయినే విమర్శల పాలు చేసారు.

తాజాగా కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్ నాధ్ సింగ్ వైరముత్తుని సత్కరించనున్న నేపథ్యంలో మరోసారి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది చిన్మయి శ్రీపాద. వైరముత్తుకు డాక్టరేట్ ఇస్తున్నందుకు సంతోషం అయితే దానితో పాటుగా ఉత్తమ కామాంధుడి అవార్డు కూడా ఇస్తే సముచితంగా ఉంటుందని ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది. చిన్మయి ట్వీట్ పై మళ్ళీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైరముత్తు అభిమానులు. అయితే నాకు అన్యాయం జరిగితే న్యాయం చేయండని కోరితే నన్నే విమర్శిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది చిన్మయి.