ప్రభుదేవా పేరుని చెరిపేసిన నయనతార

Published on Apr 16,2020 05:53 PM
హీరోయిన్ నయనతార తన చేతి మీద ఉన్న ప్రభుదేవా అనే పచ్చబొట్టుని చెరిపేసింది. ప్రభుదేవా మీద ప్రేమతో అప్పట్లో తన చేతి మీద పచ్చబొట్టు వేయించుకుంది. పచ్చబొట్టు చెరిగిపోదు కాబట్టి , ప్రభుదేవాతో పెళ్లి రద్దు అయ్యింది కాబట్టి ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నప్పటికీ ఇటీవలే తన చేతి మీద ఉన్న పచ్చబొట్టుని రీ డిజైన్ చేయించింది దాంతో ప్రభుదేవా అనే అక్షరాలు పోయాయి దాంతో సంతోషంగా ఉంది నయనతార.

హీరో శింబు ని ఆ తర్వాత ప్రభుదేవాని ప్రేమించిన నయనతార వాళ్ళిద్దరితో విడిపోయాక యువ దర్శకులు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. ఆ ప్రేమ ముదిరి పాకాన పడటంతో గత అయిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు నయనతార - విగ్నేష్ శివన్ లు. తనకు పెళ్లి కలిసి రావడంలేదని భావించిన ఈ భామ అతడితో సహజీవనం చేస్తోంది. ఆమధ్య విగ్నేష్ తో కూడా విబేధాలు వచ్చాయని , వాళ్ళు విడిపోయారని వార్తలు వచ్చాయి కానీ మేమిద్దరం విడిపోలేదని స్పష్టం చేసారు నయనతార - విగ్నేష్ లు.