బాలయ్య సినిమాలో నయనతార

Published on Feb 14,2020 06:18 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమాలో ఒక హీరోయిన్ గా నయనతార ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతకొంత కాలంగా నయనతార  సోలోగా నటించిన చిత్రాలు ప్లాప్ అవుతుండటంతో స్టార్ హీరోల సరసన నటించాలని నిర్ణయించుకుందట. బాలయ్య సరసన నటించిన చిత్రాలు హిట్ కావడంతో బాలయ్య సరసన ఆఫర్ రాగానే ఒప్పేసుకుందని సమాచారం.

పైగా ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడు కూడా కావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో సింహా , లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ లు వచ్చాయి దాంతో ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా కొంతసేపు కనిపిస్తాడట. ఈనెలలోనే అఘోర పాత్రకు సంబందించిన పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నారట దర్శకులు బోయపాటి.