మురుగదాస్ పై ఫైర్ అవుతున్న నయనతార

Published on Jan 15,2020 06:13 PM
దర్శకులు ఏ ఆర్ మురుగదాస్ పై నిప్పులు చెరుగుతోంది హీరోయిన్ నయనతార. దర్శకులు మురుగదాస్ నన్ను మోసం చేసాడని ఆరోపిస్తోంది నయనతార. ఇప్పటికే గజిని చిత్రంలో నటించినందుకు చాలా బాధపడుతున్నానని అయితే అలాంటి తప్పు జరగదని చెప్పి దర్బార్ చిత్రంలో మంచి పాత్ర అని నమ్మించాడట దర్శకులు మురుగదాస్. కానీ సినిమా చూస్తే మళ్ళీ మోసం జరిగిందని నా పాత్రని మరీ చిన్నదిగా చేసి చూపించారని జూనియర్ ఆర్టిస్ట్ కంటే దారుణమైన పాత్రని చేసాడని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది నయనతార.

అప్పట్లో మురుగదాస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది నయనతార. కట్ చేస్తే రజినీకాంత్ సరసన అని చెప్పి ఒపించాడట. అయితే దర్బార్ చిత్రంలో చాలా సన్నివేశాలే చిత్రీకరించారట కానీ సినిమాలో మాత్రం చాలా తక్కువ సన్నివేశాలు ఉండటంతో నయనతార చాలా ఆగ్రహంగా ఉందట. ఇక కొంతమంది నయనతారకు మురుగదాస్ పై చాలానే చాడీలు చెప్పారట దాంతో మరింత ఆవేశంగా ఉంది నయనతార.