నయనతార బాగా డిమాండ్ చేస్తోందట

Published on Nov 21,2019 02:00 PM

స్టార్ హీరోలకు సమానంగా ఇమేజ్ ఉన్న హీరోయిన్ నయనతార దాంతో స్టార్ డం ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి అనుకున్న ఈ భామ తన రెమ్యునరేషన్ ని దాదాపుగా డబుల్ చేసిందట. ఇంతకుముందు ఈ భామ 4 నుండి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేదని కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా 8 కోట్లు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతోందట. నయనతార నటించే చిత్రాలను తెలుగు , మలయాళ భాషలలో డబ్బింగ్ చేస్తున్నారు దాంతో అలా నిర్మాతలకు అదనపు ఆదాయం నయనతార వల్ల వస్తోంది కాబట్టి ఈ మొత్తం ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారట.

తాజాగా ఈ భామ రజనీకాంత్ సరసన దర్బార్ చిత్రంలో నటిస్తోంది. ఇక ఆ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. రజనీకాంత్ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ ఉంటాయి . సినిమా బాగుంటే ఇక చెప్పాలా ? అందుకే తన రెమ్యునరేషన్ ని 8 కోట్లకు పెంచిందట నయనతార. స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్ నాది అని భావిస్తుందేమో అందుకే ఇలా రేటు పెంచింది.