భయపెడుతున్న నయనతార బాయ్ ఫ్రెండ్

Published on Feb 21,2020 04:02 PM
నయనతార బాయ్ ఫ్రెండ్ దర్శకులు విగ్నేష్ శివన్ అంటే భయపడుతున్నారట తమిళ నిర్మాతలు. నయనతార తమ చిత్రంలో నటించాలంటే 6 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నామని అవి చాలదన్నట్లు నయనతార వ్యక్తిగత సిబ్బందికి కూడా మేమే జీతాలు ఇవ్వాల్సి వస్తోందని అలాగే ప్రియుడు విగ్నేష్ శివన్ తరచుగా లొకేషన్ లకు వస్తుంటాడని దాంతో వాళ్లకు కావాల్సినవి సమకూర్చడం తలకు మించిన భారం అవుతోందని పోనీ ఇన్ని చేస్తే సినిమా ప్రమోషన్ కు వస్తుందా ? అంటే రాదు .

సినిమా ప్రమోషన్ లతో నాకు సంబంధం లేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పే నయనతార కు తెలియదా ? భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఆమె వ్యక్తిగత సిబ్బంది జీతాలను మామీద రుద్దడం కరెక్ట్ కాదని అలాగే ప్రియుడు విగ్నేష్ శివన్ తరచుగా లొకేషన్ లకు రావడం వల్ల అనుకున్న సమయానికి షూటింగ్ కావడం లేదు సరికదా అదనపు ఖర్చులు కూడా మీద పడుతున్నాయని వాపోతున్నారు నిర్మాతలు. అందుకే నిర్మాతల మండలి ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.