సైరా నరసింహారెడ్డి ట్రైలర్ రివ్యూ

Published on Sep 19,2019 10:35 AM

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. నిన్న విడుదలైన ట్రైలర్ కు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సైరా నిజంగానే చరిత్ర సృష్టించేలా ఉందని పొంగిపోతున్నారు మెగా ఫ్యాన్స్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరంజీవి తో పాటుగా అమితాబ్ , నయనతార , జగపతిబాబు , విజయ్ సేతుపతి , సుదీప్ , తమన్నా , నిహారిక , తదితరులు నటించారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ లో భారీ యాక్షన్ సీన్స్ తో పాటుగా భారీ విజువల్స్ , భారీ డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. చిరు లుక్ అలాగే పవర్ ఫుల్  డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఈనెల 22 న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అలాగే అక్టోబర్ 2 న భారీ ఎత్తున సైరా ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ధీమాగా ఉన్నారు మెగా ఫ్యాన్స్.