విలన్ గెటప్ కోసం కొత్తగా ట్రై చేస్తున్న నాని

Published on Jan 11,2020 11:30 AM
హీరో నాని విలన్ గా నటించడానికి సిద్దమయ్యాడు. తన గురువు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కనున్న'' వి '' చిత్రంలో నాని నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ పోషిస్తున్నాడు. సీరియల్ కిల్లర్ పాత్ర కావడంతో స్టైలింగ్ తో పాటుగా గెటప్ కూడా కొత్తగా ఉండాలని సరికొత్త మేకోవర్ తో షాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు నాని. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా విలన్ గా నాని నటించనున్నాడు. ఇక ఈ సినిమా మలేషియా , థాయిలాండ్ , మనాలి లలో షూటింగ్ జరుపుకోనుంది.

నాని కి ఇది 25 వ సినిమా కావడం విశేషం. దాంతో సరికొత్తగా ఉండాలని నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ని ఎంపిక చేసుకున్నాడు. పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర , చిత్రం కూడా కావడంతో ఈ సాహసానికి పూనుకున్నాడు నాని. నివేదా థామస్ , అదితి రావు హైదరి హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు కాబట్టి నాని ధైర్యం చేసాడట. ఇంతకుముందు నాని - మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో అష్టా చమ్మా , జెంటిల్ మెన్ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.