ఉగాదికి రిలీజ్ కానున్న నాని - సుధీర్ ల చిత్రం

Published on Nov 19,2019 09:56 PM

హీరో నాని - సుధీర్ లు నటిస్తున్న '' వి '' చిత్రం ఉగాది కానుకగా 2020 మార్చి 25 న విడుదల కానుంది. అష్టాచెమ్మా , జెంటిల్ మెన్  వంటి విభిన్న కథా చిత్రాలను అందించిన దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని విలన్ గా నటిస్తుండటం విశేషం. ఇక హీరోగా మహేష్ బాబు బావ సుధీర్ బాబు నటిస్తున్నాడు. ఇటీవలే ముంబై లో భీకర పోరాట దృశ్యాలను నాని - సుధీర్ ల మధ్య చిత్రీకరించారట.

ఈ ఫైట్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు చిత్ర బృందం. నాని నెగెటివ్ షేడ్ పాత్ర పోషిస్తుండటంతో ఈ '' వి '' చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. ఇక హీరోయిన్ లుగా  నివేదా థామస్ ,అదితి రావ్ హైదరి లు నటిస్తున్నారు. నివేదా థామస్ ఒప్పుకుందంటే ఖచ్చితంగా ఆ సినిమా కథ బాగుంటుందన్న నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. ఇక ఈ చిత్రాన్ని ఉగాది రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.