విలన్ గా నాని ?

Published on Mar 16,2019 01:47 PM

వరుస విజయాలతో తిరుగులేని హీరోగా ప్రూవ్ చేసుకున్న నాని తాజాగా విలన్ గా నటించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది . సంచలనం సృష్టించే ఈ విషయం నిజమే ! పూర్తిగా నెగెటివ్ షేడ్ లో సాగే పాత్రలో నటించడానికి నాని ఒప్పుకున్నాడు అది ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలో . మోహనకృష్ణ ఇంద్రగంటి నాని గురువు , నాని ని హీరోగా పరిచయం చేసింది ఇంద్రగంటి అన్న విషయం తెలిసిందే. 

హీరోగా సక్సెస్ సాధిస్తున్న తరుణంలో జెంటిల్ మెన్ చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో మెప్పించాడు నాని . దాంతో నాని ని ఫుల్ లెంగ్త్ విలన్ గా చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందట ఇంద్రగంటి కి ఇంకేముంది ఆలోచన రావడమే తరువాయి స్క్రిప్ట్ రాసె పనిలో పడ్డాడు . త్వరలోనే నాని విలన్ గా నటించే సినిమా స్టార్ట్ కానుంది . ఇక ఈ చిత్రంలో హీరో సుధీర్ బాబు.