నాని సినిమా విడుదల ఆగిపోయింది

Published on Mar 15,2020 06:23 PM

నాని -సుధీర్ బాబు లు కలిసి నటించిన ''వి '' చిత్రం ఈనెల 25 న ఉగాది కానుకగా విడుదల కావాల్సి ఉండే కానీ కరోనా ఎఫెక్ట్ తో ఆ సినిమా విడుదల ఆగిపోయింది. ఇక కొత్త డేట్ ఎప్పుడు అన్నది ఈనెలాఖరున చెప్పనున్నారు. కరోనా అదుపులోకి వస్తే అప్పుడు వి చిత్రం విడుదల అవుతుంది అది కూడా ఏప్రిల్ లో లేదంటే మళ్ళీ వాయిదా పడటం ఖాయం. కరోనా భయంతో ఇప్పటికే తెలంగాణలో సినిమా థియేటర్ లతో పాటుగా షాపింగ్ మాల్స్ , ఫంక్షన్ హాళ్లు , పాఠశాలలు , కళాశాలలు మూతపడ్డాయి.

కరోనా భయంతో జనాలు కూడా సినిమా థియేటర్ లకు వెళ్లడం లేదు దాంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోబోతుండటంతో నాని సినిమాని వాయిదా వేశారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుధీర్ బాబు , నివేదా థామస్ తదితరులు నటించారు. నాని ఇందులో విలన్ గా నటించడం విశేషం.