నాని సినిమాకు వెరైటీ టైటిల్

Published on Dec 03,2019 03:05 PM

నాని సినిమాకు వెరైటీ టైటిల్ పెట్టారు , తాజాగా ఆ టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా ......  '' టక్ జగదీష్ ''. నిన్ను కోరి , మజిలీ వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శివ నిర్వాణ ఈ టక్ జగదీష్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇంతకుముందు నాని - శివ నిర్వాణ కాంబినేషన్ లో నిన్ను కోరి చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.

నిన్ను కోరి చిత్రంతో నాని ని మళ్ళీ హిట్ బాట పట్టించాడు శివ దాంతో మరోసారి అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు టైటిల్ ని అనౌన్స్ చేసారు , త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది టక్ జగదీష్ చిత్రం. ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ నటించనుంది. వెరైటీ టైటిల్ తో ఆసక్తి క్రియేట్ చేశారు దర్శక నిర్మాతలు. టక్ జగదీష్ పట్ల నాని చాలా నమ్మకంగా ఉన్నాడట అందుకే వెంటనే డేట్స్ ఇచ్చాడు.