జెర్సీ సినిమా షూటింగ్ లో గాయపడిన హీరో నాని

Published on Jan 28,2019 05:08 PM

హీరో నాని కి గాయాలయ్యాయి. తాజాగా ఈ హీరో నటిస్తున్న చిత్రం జెర్సీ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. కాగా షూటింగ్ జరుగుతున్న సమయంలో నాని ముక్కు కి గాయం అయ్యింది. దాంతో చిత్ర బృందం షాక్ అయ్యారు. 

అయితే నాని కి తగిలింది చిన్న గాయం మాత్రమే కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నాని నటించిన గత రెండు చిత్రాలు ప్లాప్ అయ్యాయి దాంతో ఈ సినిమా హిట్ కావాలని తపన పడుతున్నాడు. గౌతమ్ తిన్ననూరి కి ఇది రెండో సినిమా . ఇక ఈ చిత్రంలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. ఇక ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.