హిట్ చిత్రానికి సీక్వెల్ చేస్తారట

Published on Mar 02,2020 09:38 PM

విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ చిత్రం సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆ చిత్రానికి సీక్వెల్ చేస్తామని ప్రకటించాడు హీరో నాని. శైలేష్ కొలను దర్శకత్వంలో హీరో నాని ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28 న విడుదలైన హిట్ చిత్రం సక్సెస్ సాధించడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు చిత్ర బృందం. ఆ సందర్బంగా హీరో నాని మాట్లాడుతూ ఈ సినిమాకు వచ్చే ఏడాది సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేసాడు. 2021 లో హిట్ కేస్ 2 ఉంటుందని చెప్పి ఆశలు రేకెత్తించాడు.

ఇక విశ్వక్ సేన్ నటనకు ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు. విశ్వక్ కు ఇది నాలుగో సినిమా అయినప్పటికీ కమర్షియల్ హిట్ అందుకున్నది మాత్రం హిట్ తోనే ! దాంతో చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక విభిన్న కథా చిత్రాలను నిర్మిస్తూ విజయాలు అందుకుంటున్నాడు నాని. అ చిత్రంతో విజయం అందుకున్న నాని ఇప్పుడు హిట్ తో సూపర్ హిట్ అందుకున్నాడు.