ఆ ప్లాప్ డైరెక్టర్ కు ఈ హీరో కూడా హ్యాండ్ ఇచ్చాడట !

Published on Oct 24,2019 05:47 PM

మహేష్ బాబు తో బ్రహ్మోత్సవం వంటి డిజాస్టర్ చిత్రాన్ని చేసిన దర్శకులు శ్రీకాంత్ అడ్డాల కు వరుసగా సినిమా కష్టాలు వస్తున్నాయి. బ్రహ్మోత్సవం ప్లాప్ కావడంతో శ్రీకాంత్ అడ్డాలతో చేయాలనుకున్న పలువురు హీరోలు వరుసగా హ్యాండ్ ఇస్తూ వచ్చారు. అయితే ఒకదశలో హీరో నాని ఛాన్స్ ఇస్తున్నట్లు తెలిసింది కట్ చేస్తే నాని కూడా హ్యాండ్ ఇచ్చాడట ! దాంతో హీరో వరుణ్ తేజ్ పై ఆశలు పెట్టుకున్నాడు ఈ దర్శకుడు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ కూడా శ్రీకాంత్ అడ్డాలకు హ్యాండ్ ఇచ్చాడని తెలుస్తోంది. శ్రీకాంత్ అడ్డాల - వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో ముకుంద అనే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. అయితే ముకుంద కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో కాబోలు శ్రీకాంత్ అడ్డాల తో సినిమా చేయడానికి నిరాకరిస్తున్నాడట వరుణ్ తేజ్.