డిజాస్టర్ నుండి తృటిలో తప్పించుకున్న నాని

Published on Feb 18,2020 07:12 PM

హీరో నాని భారీ డిజాస్టర్ నుండి తృటిలో తప్పించుకున్నాడు. ఇంతకీ నాని తప్పించుకున్న డిజాస్టర్ సినిమా ఏంటో తెలుసా ....... వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం. విజయ్ దేవరకొండ హీరోగా ఈ చిత్రాన్ని మొదట హీరోగా నటించమని నానిని సంప్రదించారట దర్శక నిర్మాతలు. అయితే క్రాంతిమాధవ్ చెప్పిన కథ విన్నాక ఎందుకో నచ్చలేదట ! దాంతో ఈ సినిమా చేయడం కుదరదని , డేట్స్ ఖాళీ లేవని చెప్పాడట.

కట్ చేస్తే అదే కథని విజయ్ దేవరకొండకు చెప్పాడు దర్శకుడు క్రాంతిమాధవ్. విజయ్ దేవరకొండకు బాగా నచ్చింది వేరియేషన్స్ ఉన్నాయి అనుకున్నాడు ...... సినిమా చేసాడు కట్ చేస్తే తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం. నాని కోసం రాసిన కథ నాని కి నచ్చకపోవడంతో దాన్ని విజయ్ దేవరకొండ కు చెప్పడం అది నచ్చడం జరిగింది. కానీ ప్రేక్షకులకు నచ్చలేదు దాంతో తిప్పి కొట్టారు ఈ ప్రేమికుడిని.