విరాటపర్వంలో నందితాదాస్

Published on Aug 30,2019 11:15 AM

యువ దర్శకులు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం '' విరాటపర్వం ''. రానా - సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రలో నందితాదాస్ నటిస్తోంది. ఆమేరకు షూటింగ్ కోసం హైదరాబాద్ లో దిగింది అంతేకాదు షూటింగ్ లో పాల్గొంది కూడా. మంచి పాత్ర లభించింది అందుకే చేస్తున్నా, టబు నటించడానికి నిరాకరించింది కదా అని వదులుకోలేను కదా ! అంటూ ఎదురు ప్రశ్న కూడా వేస్తోంది నందితాదాస్. 
మొదట ఈ చిత్రంలో టబు నటించడానికి ఒప్పుకుంది కానీ అల్లు అర్జున్ -త్రివిక్రమ్ ల సినిమా కోసమో లేక మరో కారణమో కానీ విరాటపర్వం నుండి తప్పుకుంది దాంతో నందితాదాస్ ని ఎంచుకున్నాడు దర్శకుడు వేణు. నీది నాది ఒకే కథ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన వేణు ఇప్పుడు విరాటపర్వం అనే సంచలన చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమా విడుదల అయ్యాక సంచలనం సృష్టించడం ఖాయమని ధీమాగా ఉన్నాడు వేణు.