కన్నీళ్లు పెట్టుకున్న నందమూరి కళ్యాణ్ రామ్

Published on Jan 13,2020 04:38 PM

నందమూరి కళ్యాణ్ రామ్ కన్నీళ్లు పెట్టుకొని అలీ ని షాక్ కి గురి చేసాడు. ఓ ఛానల్ లో అలీ నిర్వహించే షోకి గెస్ట్ గా నందమూరి కళ్యాణ్ రామ్ ని ఆహ్వానించారు. కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురా సంక్రాంతి కానుకగా జనవరి 15 న విడుదల అవుతున్న సందర్బంగా ఈ షో చేసారు. కాగా ఆషోలో పాల్గొన్న సందర్బంగా అలీ ఎన్టీఆర్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కన్నీళ్ల పర్యంతం అయ్యాడు దాంతో షాక్ అవ్వడం అలీ వంతయ్యింది.

ఎన్టీఆర్ నాకు తమ్ముడే అయినప్పటికీ నాన్న తర్వాత నాన్న లాంటివాడు నాకు చిన్నప్పటి నుండి కూడా ఎన్టీఆర్ ని నాన్న అని పిలవడమే ఇష్టం అలాగే పిలిచేవాడ్ని అతడు ఎంత ఎత్తుకు ఎదిగినా నాకు చిన్న పిల్లాడిగానే కనిపిస్తాడు అంటూ తనకు ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పాడు కళ్యాణ్ రామ్. నందమూరి హరికృష్ణ కు ఇద్దరు భార్యలు కాగా పెద్ద భార్య కొడుకు కళ్యాణ్ రామ్ కాగా చిన్న భార్య కొడుకు ఎన్టీఆర్ అన్న విషయం తెలిసిందే. మొదట్లో వీళ్ళు అంతగా సఖ్యతగా లేకపోయినా 2008 నుండి ఎన్టీఆర్ హరికృష్ణ కుటుంబానికి బాగా దగ్గరయ్యాడు దాంతో అన్నాదమ్ముల మధ్య మంచి అనుబంధం పెనవేసుకుంది.