క్షమాపణ కోరిన బాలకృష్ణ

Published on Mar 29,2019 12:37 PM

అమ్మనా బూతులు తిట్టాడు , చంపేస్తా నన్నాడు అది మీడియాలో సంచలనం కావడంతో అది పొరపాటున జరిగింది అంటూ క్షమాపణ చెప్పాడు హీరో నందమూరి బాలకృష్ణ . ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలకృష్ణ ఓ మీడియా ప్రతినిధి పై న తీవ్ర దూషణలు చేసిన విషయం తెలిసిందే . అయితే అవి మీడియాలో రావడంతో బాలయ్య పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి . దాంతో తప్పు తెలుసుకున్న బాలయ్య క్షమాపణ కోరాడు . 

హిందూపురంలో బాలయ్య పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . గత అసెంబ్లీ ఎన్నికల్లో బాలయ్య హిందూపురం నుండి గెలవగా ఈసారి మాత్రం చాలా కష్టమే అని అంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు . బాలయ్య దుసురుగా ప్రవర్తించడమే కాకుండా అక్కడ పెద్దగా అభివృద్ధి చేసిందేమి లేదని పైగా ప్రజలకు అందుబాటులో ఉండడని విమర్శలు ఉన్నాయి .