రూలర్ కథ రివీల్ అయ్యింది

Published on Dec 10,2019 02:02 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న చిత్రం రూలర్. తమిళ దర్శకులు కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఉత్తరాది సంగీత దర్శకుడు చిరంతన్ భట్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇంతకుముందు చిరంతన్ భట్ బాలయ్య నటించిన రెండు చిత్రాలకు సంగీతం అందించాడు దాంతో మరోసారి ఛాన్స్ ఇచ్చారు.ఇక తాజాగా ట్రైలర్ విడుదల కాగా ఆ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది బాలయ్య అభిమానుల నుండి. అయితే మిగతావాళ్ళు మాత్రం రూలర్ ట్రైలర్ పట్ల పెదవి విరుస్తున్నారు. ట్రైలర్ సంగతి పక్కన పెడితే ఈ కథ ఉత్తరాది నేపథ్యంలో రూపొందినట్లు తెలుస్తోంది.

ఇదే విషయాన్నీ ట్రైలర్ లో కాస్త చూపించగా నిర్మాత సి. కళ్యాణ్ కూడా ఇదే విషయాన్నీ కన్ఫర్మ్ చేసాడు. ఉత్తరాదిన స్థిరపడిన తెలుగు కుటుంబాల కోసం పోరాడే పాత్రలో బాలయ్య నటిస్తున్నట్లు చెబుతున్నాడు. బాలయ్య ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అలాగే బిజినెస్ మెన్ గా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నాడు. బిజినెస్ మెన్ పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది , అయితే పోలీస్ ఆఫీసర్ పాత్రలో గెటప్ పై మాత్రం విమర్శలు వస్తున్నాయి. బాలయ్య సినిమా అంటే పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయన్నది తెలిసిందే కదా ! వాటికి మాత్రం ఇందులో కొదవలేదని చెప్పాలి.