గుంటూరు లో సందడి చేసిన నగ్మా

Published on Dec 14,2019 05:08 PM

హాట్ భామ నగ్మా గుంటూరు లో సందడి చేసింది. గుంటూరు లో జరిగిన ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొంది నగ్మా. గ్లామర్ తార కావడంతో నగ్మా ని చూడటానికి , ఫోటోలు దిగడానికి పొతే పడ్డారు పలువురు. దాంతో నగ్మా కు సెక్యూరిటీ గా పలువురు నిర్వాహకులు నిలవాల్సి వచ్చింది. అయితే ఎంతగా సెక్యూరిటీ కల్పించినప్పటికీ యువకుల ముందు బలాదూర్ అయ్యింది. 90 వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసిన భామ నగ్మా. కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన ఈ భామ ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు. సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేస్తూ ఆ పార్టీ బలోపేతానికి పాల్పడుతోంది.

సినిమాల్లో నటించడం లేదు కాబట్టి ఫుల్ టైం రాజకీయాలకే కేటాయిస్తోంది నగ్మా. అప్పుడప్పుడు ఇలా ఆటవిడుపులా కొన్ని ప్రయివేట్ కార్యక్రమాలలో పాల్గొంటోంది. 45 ఏళ్ల నగ్మా ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోలేదు ప్రేమలో విఫలం కావడంతో. అయితే తన ఇద్దరు చెల్లెళ్లకు మాత్రం పెళ్లి చేసింది నగ్మా. ఇంతకీ నగ్మా చెల్లెల్లు ఎవరో తెలుసా ...... హీరో సూర్య భార్య జ్యోతిక , అలాగే మరో హీరోయిన్ రోషిని. వాళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి కానీ నగ్మా మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు.