నాగశౌర్య కు దెబ్బ మీద దెబ్బ

Published on Apr 09,2019 03:38 PM

యంగ్ హీరో నాగశౌర్య కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది . ''ఛలో'' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాగశౌర్య కెరీర్ ఎక్కడికో వెళ్ళాలి కానీ వచ్చిన అవకాశాలను పక్కన పెట్టి ఏరికోరి మరీ చెత్త సినిమాని చేసాడు '' నర్తనశాల '' అని . అది డిజాస్టర్ అవ్వడమే కాకుండా ఆర్ధికంగా కూడా దెబ్బ కొట్టింది . దాని తర్వాత నాగశౌర్య కెరీర్ మరింతగా లోయలోకి పడిందనే చెప్పాలి . 

సుకుమార్ దర్శకత్వ పర్యవేక్షణలో అతడి శిష్యుడి దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నారు కానీ అది తేడా కొట్టింది దాంతో ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది . ఇక ఇప్పుడేమో భవ్య ఆనంద్ ప్రసాద్ నిర్మించే సినిమా కూడా క్యాన్సిల్ అయ్యిందట . భవ్య ఆనంద్ ప్రసాద్ పైసా వసూల్ తో పాటుగా పలు సినిమాలు తీసి ఆర్ధికంగా నష్టపోయాడు అలాగే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు కూడా దాంతో నాగశౌర్య తో చేద్దామనుకున్న సినిమా ఆగిపోయింది . వరుసగా నాగశౌర్య కు దెబ్బ మీద దెబ్బలు పడుతుండటంతో మళ్ళీ ఇతగాడి కెరీర్ గాడిలో పడటం కష్టమే అని వినిపిస్తోంది .